అమెజాన్ అదిరిపోయే ఆఫర్…

0
138
shopping offers and exclusive deals

కరోనా మహమ్మారి దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ కోసం మాత్రమే వెళ్లవచ్చు. సాధారణ పరిస్థితుల్లోనే ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన చాలామంది లో ఉంటుంది. దీంతో వివిధ కంపెనీలు డెలివరీ సేవలు అందిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో చాలామంది చేతిలో డబ్బులు లేకుండా పోయాయి లేదా దాచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అమెజాన్ ఇండియా మొబైల్ యాప్ ద్వారా అమెజాన్ పే లేటర్ సర్వీస్‌ను రిజిస్టేషన్‌ చేసుకోవాలి. ఈ సేవలు ప్రస్తుతం డెస్క్ టాప్ యూజర్లకు అందుబాటులో లేవు. అమెజాన్ పేని రిజిస్టేషన్‌ చేసుకునే కస్టమర్లు KYCని పూర్తి చేయాలి. అనంతరం మీరు అర్హులో కాదో డాష్ బోర్డుపై ‘నో యువర్‌ స్టేటస్’ వద్ద చెక్‌ చేసుకోవచ్చు. మనం ఎంత రుణం వస్తుందో కూడా డ్యాష్ బోర్డుపై చూపిస్తుంది. ఇది సులభమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీరు కొనుగోలు చేసిన వాటికి బిల్లును వచ్చే నెలలో ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. లేదా 12 సులభ వాయిదాల్లో తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది.. క్రెడిట్ కార్డు అవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here