శివసేన సీనియర్ నాయకుడు కన్నుమూత

15
shiv-sena-senior-leader-eyelid

మహారాష్ట్రలో శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, భారతీయ కామ్‌గార్ సేన అధ్యక్షుడు సూర్యకాంత్ మహదిక్ చనిపోయారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. మహదిక్ మృతి పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సూర్యకాంత్ మహదిక్ మృతివార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉద్దవ్ థాక్రే పేర్కొన్నారు. భారతీయ కామ్‌గార్ సేన ద్వారా కార్మికుల హక్కుల కోసం అతను ఎనలేని పోరాటం చేశారని కొనియాడారు. సూర్యకాంత్ మహదిక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here