“సదా అందరికీ నేను కృతజ్ఞుడిని..” అంటున్న శిఖర్ ధావన్

33
sikar dhawan

ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఒక మైలురాయిని చేరుకున్నాడు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ బాట్స్మెన్ శిఖర్ ధావన్. అదేంటా అనుకుంటున్నారా ఏంలేదండీ ధావన్ ఇండియన్ టీమ్ లోకి వచ్చి కరెక్ట్ గా పది సంవత్సరాలు అయింది. పది సంవత్సరాల నుండి ధావన్ కష్టపడుతున్న తీరు ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తి. అండర్ 19 వరల్డ్ కప్ లో అత్యధికంగా(505) పరుగులు చేసి అప్పటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు శిఖర్ ధావన్. కానీ టీమ్ లోకి రావడానికి ఆరు సంవత్సరాలు పట్టింది ఈ లెఫ్ట్ హ్యాండ్ బాట్స్మెన్ కి..! కారణం భారత జట్టులో అప్పటికే ఫామ్ లో ఉన్న సభ్యులు ఎందరో ఉన్నారు.

అయితే నిన్న జరిగిన ఐపియల్ మ్యాచ్ లో శిఖర్ ధావన్ పంజాబ్ జట్టుపై సెంచరీని కూడా సాధించి తన ఫామ్ ని మరోసారి కొనసాగించాడు . నిన్నటి సెంచరీ మరియు నిన్నటి తేదీ శిఖర్ కి బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ఇదే విషయంపై పలువురు ధావన్ కి విషెస్ ని తెలియజేసారు. దీనిపై శిఖర్ ధావన స్పందిస్తూ నా తల్లి భారత మాతకు పదేళ్లు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వంగా ఉంది. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి..ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన భరతమాతకు రుణపడి ఉంటాను అని భావోద్వేగంతో ధావన్ ట్వీట్ చేసాడు. అయితే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్న శిఖర్ ధావన్ ఈ పదేళ్లలో ఎన్నో మైలురాయిలు అధిగమించాడు. ఈ ఫామ్ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి మీ మిర్చి పటాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here