

శర్వానంద్ ఈ పేరు అందరికి తెలుసు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. శర్వానంద్ చేసే సినిమాలు ప్లాప్ అయినా హిట్ అయినా లైన్ గా మూవీస్ చేస్తూ అరుదైన హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ లైన్ గా మూవీస్ తో బిజీ అయిపోయాడు .శర్వా లేటెస్ట్ మూవీ శ్రీకారం నుండి రీసెంట్ గా పోస్టర్ విడుదల చేశారు. ఈ సారి సంక్రాంతి పండగ వస్తుంది కాబట్టి సంక్రాంతి పాటని విడుదల చేశారు. విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ బలేగుంది బాలా సంగీత ప్రియులని బాగా ఆకర్షించింది.
ఇప్పుడు విడుదలైన పాట సంక్రాంతి సంబరాలని ,కల్లకు కట్టినట్లు చూపిస్తుంది .సందళ్లే సందళ్లే సంక్రాంతి సందళ్లే ఈ పాట తన సాహిత్యంతో ఎందరో గుండెల్ని కట్టపడేసింది. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది. ఈ సినిమా బీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ మూవీ లో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా కనిపిస్తుంది .ఈ చిత్రాన్ని 14ప్లస్ రీల్స్ బ్యానర్‌పై రాం అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు.