దేశంలో మొట్టమొదటిగా ఉరికంబం ఎక్కబోతున్న మహిళ..

17
shabnam-to-be-first-woman-on-gallows-in-independent-india

స్వాతంత్రం వచ్చాక దేశంలో మొట్టమొదటి సారిగా ఒక మహిళ ఉరికంబం ఎక్కబోతోంది. దీనికొరకు ఉత్తరప్రదేశ్‌లోని మథుర జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. షబ్నమ్ అనే మహిళ ఇంగ్లిష్‌లో ఎంఏ కంప్లీట్ చేసింది. ఐదో తరగతి కూడా చదువుకోని సలీం అనే అతన్ని ప్రేమించింది. అతడినే పెళ్లాడాలనుకుంది. అయితే అందుకు ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే 2008లో షబ్నమ్ తన ప్రియుడితో కలిసి తన కుటుంబానికి చెందిన ఏడుగురిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపింది. అందులో ఆమె తల్లిదండ్రులు, సోదరులు మరియు ఓ చిన్నారి కూడా ఉన్నారు.

దీంతో షబ్నమ్, సలీంలపై పోలీసు కేసు నమోదైంది. అప్పటికే షబ్నమ్ గర్భవతి. తరువాత.. షబ్నమ్‌ జైలులోనే తాజ్‌కు జన్మనిచ్చింది. ఇక, షబ్నమ్ తన కుమారుడిని పెంచే బాధ్యతను జర్నలిస్టు ఉస్మాన్‌ సైఫీకి తాజ్‌కు అప్పగించింది. ఈ కేసులో షబ్నమ్‌, సలీంలను దోషులుగా నిర్ణయించిన స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. దీంతో వారు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా అక్కడ కూడా వారికి అవే శిక్షలను కోర్టు ఖరారు చేసింది. దీంతో 2016లో షబ్నమ్ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోగా ఆ పిటిషన్ ఆయన తిరస్కరణకు గురైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here