

మరో జీవికి ప్రాణం పోయాలంటే రెండు వేరే వేరు లింగాలు సంపర్కం జరగాల్సిందే.. అప్పుడే మరో జీవి జీవం పోసుకుంటుంది. అయితే అది అప్పటి కాలంలో ఇప్పుడు మాత్రం శృంగారం అనేది ఒక వ్యసనం అయ్యింది.. కేవలం శారీరక సుఖాలను పొందడంతో వావి వరుసలు కూడా మర్చిపోయి రెచ్చిపోతున్నారు.. ఇకపోతే శృంగారాన్ని ఎలాంటి సమయాల్లో చేస్తే భావ తృప్తి పొందుతారు. ఏ వయసులో ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. శృంగారం అనేది ఒక ప్రకృతి చర్య దీనిని ఆస్వాదించాలి అని నిపుణులు అంటున్నారు.. వయసును బట్టి శృంగారంలో కూడా భారీ మార్పులు వస్తాయని చెబుతున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
20 లో శృంగార కోరికలు…
ఈ వయసు యుక్త వయసు.. కోరికలు ఆపుకోవడం అంత సులువైన పని కాదు.. కోరికలు ఎక్కువగా కలుగుతాయి.. అయితే అంగం పదే పదే స్తంభిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఎలాంటి ప్రమేయం లేకుండానే ఈ వయస్సులో అంగస్తంభన కలగడం వల్ల శృంగారపరమైన ఆలోచనలు ఎక్కువ అవుతాయి..ఈ వయసులో సెక్స్ ను ఎంజాయ్ చేస్తారట..
30 లో కోరికలు…
ఈ వయసులో కోరికలు కొంచెం కంట్రోల్ అవుతాయి..వీరి శృంగార కోరికలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటాయి. కానీ ఇరవైలలో కలిగినట్టు కోరికలు మాత్రం కలగవు. అవసరమైనప్పుడు మాత్రమే అంగం స్తంభిస్తుంది. ఈ వయసులో చక్కటి శృంగారాన్ని అనుభూతి చెందుతారు..
40 లో శృంగారం…
శరీరంలో జరిగే మార్పులతోనే శృంగారం కోరికల్లోనూ మార్పులు జరుగుతాయి. శృంగారం మీద కొంచెం ఆసక్తి తగ్గుతుంది, కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమందిలో చిన్నపాటి అంగస్తంభన సమస్యలు మొదలవుతాయి. ఈ వయస్సులో శృంగారం చేయాలంటే.. తప్పకుండా ఆరోగ్యంపై సరైన శ్రద్ద పెట్టాలి ఇలా చేయక పోతే ముసలి వయసులో రావాల్సిన సమస్యలు ఈ వయసులోనే వస్తాయి..
50 లో శృంగార కోరికలు…
ఈ వయసులో శృంగార కోరికలు తగ్గుతాయి. వీరికి పిల్లలు ఉండటం మరియు అనేక బాధ్యతలు ఉండటం వలన కోరికలు చాలావరకు తక్కువే అని చెప్పుకోవాలి. అంతేకాక ఈ వయస్సులో అంగస్తంభన సమస్యలు ఉంటాయి. కానీ, అవసరమైన సమయంలో తప్పకుండా అంగస్తంభన జరుగుతుంది..ఈ విషయంలో పెద్దగా గాబరా పడాల్సిన పని లేదు…
60,70 లలో కోరికలు…
ఈ వయసులో కోరికలు ఉంటాయి.. కానీ అంగం స్తంభించాలంటే అది పాట్నర్ మీద ఆధారపడి ఉంటుంది.. అది నిజమే అనుకోండి..చింత చచ్చిన పులుపు చావలేదు అంటారుగా అది ఇదే.. మంచి ఆరోగ్యంతో ఉండే వ్యక్తులు ఈ వయస్సులోనూ శృంగారం చేయగలగుతారు. అంగం దానంతట అదే స్తంభించడం ఈ వయస్సులో కష్టం. వీరిని భాగస్వామి ప్రేరేపించాల్సి ఉంటుంది. అయితే మీరు ఆరోగ్యం గా ఉన్నట్లయితే.. 80లో కూడా 40 ఏళ్ల వ్యక్తిలా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. కాబట్టి.. మంచి అలవాట్లు, చక్కని వ్యాయమంతో మీ శృంగార జీవితాన్ని కూడా కాపాడుకోండి. శృంగారమనేది కోరిక కాదు. ఎన్నో ఒత్తిడులను దూరం చేస్తుంది..