

గోపీచంద్ హీరో గా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్ .కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సోమవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. గోపీచంద్-తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. క్రీడా నేపథ్యంతో పాటు, గుండెలని పిండేసే భావోద్వేగాలను సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.