

శ్రీశైలం లో నేటి నుంచి 17 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి .ఈరోజు నుంచి 17 వరకు శాశ్వత ఆర్జిత హోమాలైన రుద్రహోమం మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం,స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంతసేవలను దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన ఎప్పుడు లాగానే కొనసాగించనున్నారు.
మరోపక్క శ్రీశైలంలో మరో వివాదం చెలరేగింది. శ్రీశైలంలో మరో సారి అన్యమతస్తుల వివాదం రాజుకుంది. దేవస్థానం పరిపాలన భవం వద్ద స్పెషల్ పోలీసులతో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీశైలం దేవస్థానం ఈఓ రామారావుని డిమాండ్లతో కలిసిన హైందవ సంఘాలు, శ్రీశైలంలో అన్యమతస్తుల పెత్తనం ఎక్కువైంది శ్రీశైలం నుంచి రజాక్ రఫీని తీసేయాలని హైందవ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ సాయికుమార్ ని శ్రీశైలం నుండి వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.