ధోనీతో అసాధ్యమనుకున్న కల…

0
127
How MS Dhoni Made Sanju Samson's Dream Come True

భారత క్రికెట్‌ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడడంలో ముందుంటాడు. అందుకే ఈ తరం యువ క్రికెటర్లు దాదాపుగా ఈ జార్ఖండ్ డైనమైట్‌నే ఆదర్శంగా తీసుకుంటారు. అతని కెప్టెన్సీలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని వాళ్లు కలలు కంటారు. అలాంటి వారిలో కేరళ స్టార్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ అయితే, ఓసారి ధోనీ కెప్టెన్సీలో ఆడినట్టు కల కన్నాడట. ఆ కల నిజమైందని ఈ కేరళ ఆటగాడు సీఎస్‌కే మీడియా ప్రతినిధి రుఫా రమణి చాట్‌ షోలో చెప్పాడు.

19 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో, తొలిసారిగా ధోనీతో మాట్లాడానని చెప్పిన శాంసన్ ఆ తర్వాత ఐదు సంవత్సరాల వరకూ టీం ఇండియాలో ఆడే అవకాశం రాలేదని తెలిపాడు. అయితే ఈ ఐదు సంవత్సరాల మధ్య తనకు ఒక కల వచ్చేదని గుర్తు చేసుకున్నాడు. ఈ ఐదు సంవత్సరాలు భారత్‌కు ఆడుతున్నట్లు కల వచ్చేది. ఆ కలలో ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఫీల్డింగ్ మార్పు చేస్తుంటాడు. నేను స్లిప్‌లో ఉంటే.అతను వెంటనే సంజూ నువ్వు అటు వెళ్ళు అంటే నేను పరిగెత్తుతూ వెళ్తాను”అని తన కలని శాంసన్ వివరించాడు.

ఇది జరిగిన కొన్ని రోజులకే తను కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు.దీంతో నా కల తీరేనా? అని మదనపడ్డా. ఆతర్వాత, ఓసారి భారత్‌ ‘ఎ’ తరఫున ఇం గ్లండ్‌తో ముంబైలో మ్యాచ్‌ ఆడాం. దానికి ధోనీని కెప్టెన్‌గా ఉండాలని చెప్పారు.ఆ మ్యాచ్‌లో అంత కుముందు నేను కలగన్నట్లే జరిగింది.నాకెంతో ఆశ్చర్యమేసింది. కానీ, నా కల విషయాన్ని ధోనీతో చెప్పలేకపోయా. విషయం తెలిస్తే మాత్రం అతడు నవ్వేవాడు అంటూ శాంసన్‌ వివరించాడు.

నేనెప్పుడు ధోనీ గురించి మాట్లాడినా ఎమోషనల్ అవుతాను.జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ సాధారణ వ్యక్తి భారత అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదగడం మాములు విషయం కాదు.ధోనీని అనుకరించడం సాధ్యం కాదు. అతని ఆటను పరిశీలించి అతనిలా ఆడుదామని ప్రయత్నిస్తే విఫలమవుతాం।అని శాంసన్ తెలిపాడు.2015 జింబాబ్వే పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి శాంసన్ తన తొలి మ్యాచ్‌ను అజింక్యా రహానే సారథ్యంలో ఆడాడు. ఆ తర్వాత ఐదేళ్లు మళ్లీ భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై నాలుగు, ఐదో టీ20 మ్యాచ్‌లో మరోసారి అవకాశం అందుకున్న శాంసన్ ఆ చాన్స్‌ను అందిపుచ్చుకోలేకపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here