కోహ్లీ తీరుపై సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

29
sanjay-manjrekar-interesting-comments-on-kohli

ఇటీవలే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆలోచన తీరును మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మైండ్ సెట్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఓ క్రీడా సంస్థ తో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. తొలి టెస్టులో జట్టు ఎంపిక టీమిండియా వ్యూహాలు సరైనవే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆన్ ఫీల్డ్ లో బౌలింగ్ విషయంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు మాత్రం సరిగ్గా లేవని అందుకే టీమిండియా ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు సంజయ్ మంజ్రేకర్.

టీమిండియా అమలు చేసిన వ్యూహాలలో తప్పులు ఉన్నాయి అని నేను చెప్పను.. జట్టు ఎంపిక సరైనదే అని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో నదీమ్ కు అవకాశం ఇచ్చిన సమయంలో ఇక అతను సరిగ్గా రాణించక పోయేసరికి కుల్దీప్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అయితే పిచ్ కూడా కుల్దీప్ కి కొట్టిన పిండి అని.. ఇక ఇలాంటి సమయంలో ఎలాంటి బౌలర్లను ఎంపిక చేయాలి అన్న కోహ్లీ ఆలోచనను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here