ఆధ్యాత్మిక చింతనను పరిచయం చేసిన సామ్..

16
samanthas-spiritual-contemplation-in-instagram

అక్కినేని సమంత ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చింతన మరియు దైవికం గురించి సామ్ చెప్పిన విషయాలు భక్తి భావాన్నిపెంచేలా ఉన్నాయి. శిష్యులు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు దర్శనమిస్తారు.. సద్గురు చెంతకు వచ్చాను. అంటూ సామ్ ఒక ఫోటోని పోస్ట్ చేశారు. ఆధ్యాత్మిక చింతన అంటే.. మీకు మీరు గీసుకున్న సరిహద్దులను దాటడం. మీరు ఉన్న స్థితి నుంచి బయటకు వచ్చి అంతులేని మనోజ్ఞతను అనుభవించడం. మీ అజ్ఞానం కారణంగా మీరు నకిలీ అయ్యారు.

పరిమిత చింతన నుండి మిమ్మల్ని మీరు వదిలించుకోవడం. సృష్టికర్త మిమ్మల్ని చేసిన విధంగా మీకు మీరుగా జీవించడం-పూర్తిగా ఆనందకరమైన అనంతమైన బాధ్యతను నిర్వహించడాన్ని జ్ఞానోదయం సాధించడం అని అంటారు. మీ ఇంద్రియాలు మీరు వెలుపల అనుభవిస్తున్నారనే బ్రహ్మను కలిగిస్తాయి. కానీ మీరు బయట కనిపించేదాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. మీరు అనుభవించేవన్నీ అంతర్గతంగా ఉంటాయి. అది మీరు గ్రహించినప్పుడే మీకు జ్ఞానోదయం అయినట్లు లెక్క అంటూ సుదీర్ఘ సందేశాన్ని వినిపించారు సామ్. సద్గురు సూక్తుల్ని సమంత తనదైన పద్దతిలో ఇలా ఇన్ స్టా మాధ్యమంగా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here