సాయి పల్లవి డిమాండ్ అంతా ఇంతా కాదు..

0
23
Sai Pallavi in the lead roles

రౌడీ రాణి సాయిపల్లవికి ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్యాన్సర్ గా, పెర్ఫామర్ గా సౌత్ లో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాయి పల్లవి పేరు తోనే హిట్ పక్క అనే టాక్ కూడా ఉంది. అందుకే తన కాల్షీట్ల కోసం అగ్ర నిర్మాతలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఈమె నాగచైతన్య సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి అనే సినిమాలో లో నటిస్తోంది. లాక్ డౌన్ ద్వారా విరామం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత నాని తదుపరి చిత్రం `శ్యామ్ సింఘరాయ్`లో నటించే అవకాశాలు కనపడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉందంట. ఇప్పటికే స్క్రిప్టు వినేందుకు అమ్మడు ఒకే చెప్పిందని తెలుస్తోంది. అయితే సాయి పల్లవిని ఒప్పించడం అంటే అంత సులువయిన విషయమేమి కాదు.


తనకు కథ.. తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత కూడా నచ్చాలి. దాంతో పాటు దర్శక నిర్మాతలతో తన కండీషన్స్ అన్నీ మొహమాటం లేకుండా చెప్పేస్తుందని అంటుంటారు అందరు. ఒక్కో సినిమాకి ఈ బ్యూటీ ఏకంగా రూ.2కోట్లు వరకు డిమాండ్ చేస్తుందట. అంత పెద్ద మొత్తాన్ని పారితోషికంగా ఇచ్చేనందుకు సిద్దపడితేనే ఆమెను సంప్రదించాల్సి ఉంటుంది. శ్యామ్ సింఘరాయ్ చిత్రానికి రాహుల్ సంకృతన్ దర్శకత్వం వహిస్తుండగా, కోల్కతా నేపథ్యంలో ఈ మూవీని పరిచయం చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధం చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి. శ్యామ్ సింఘా రాయ్ కు ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాను సీతార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here