థామస్ ఉబెర్‌కప్‌కు దూరం…???

0
78
sai praneeth

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ బ్రాంజ్ మెడలిస్ట్ సాయి ప్రణీత్‌ థామస్‌ ఉబెర్‌కప్‌ నుంచి తొలగింపబడ్డాడు. కుడి మోకాలి నొప్పి కారణంగా ఈ టోర్నీ తాను ఆడనంటూ బుధవారం తెలిపాడు. లాక్‌డౌన్‌ ఐదునెలలు కోర్టుకు దూరంగా ఉండడం వల్లా తన ఫిట్‌నెస్‌ దెబ్బతింది అని తెలిపారు . ఈనెల 6 నుంచి తాను సాధన ప్రారంభించారని , కానీ పూర్తిగా బాగు పడలేదు అని కుడి మోకాలిలో కాస్త ఇబ్బంది అనిపించింది అని విశ్రాంతి తీసుకున్న నొప్పి తగ్గలేదని తనకి గాయం అయితే అవ్వలేదని ఫిట్నెస్ తనకు లేనప్పుడు డెన్మార్క్ వెళ్లి రిస్క్ తీసుకోలేను అని జనవరిలో ఒలింపిక్స్‌ పోటీలలో తనకు పూర్తి ఫిట్నెస్ వచ్చాకే టోర్నో బరిలో దిగాలని ఆలోచన ఉన్నట్టు తెలిపాడు.

ఇదే టోర్నీ లో నే తన వ్యక్తిగత కారణాలతో స్టార్ షట్లర్ పీవీ సింధు తప్పుకోగా, ఆ తర్వాత జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య విజ్ఞప్తితో ఆమె తిరిగి భారత టీం లో చేరిన విషయం తెలిసిందే. సింధు చేరికతో జోష్‌ వచ్చిందని ఆనందపడుతున్న సమయం లో టోర్నీ నుంచి ప్రణీత్‌ తప్పుకుంటున్నాడన్న వార్త బ్యాడ్మింటన్‌ అభిమానులను నిరాశపరిచింది. ప్రణీత్‌ ఆడకపోడం తో భారత పురుషుల టీం ని కిడాంబి శ్రీకాంత్‌ నడిపించనున్నాడు. అతడితో పాటు కశ్యప్‌, లక్ష్యసేన్‌, శుభాంకర్‌ డే జట్టులో ఆడనున్నారు.

డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయి‌రాజ్, చిరాగ్ శెట్టి జోడీ కూడా ఈ ఉబెర్ కప్‌కు దూరంగా ఉంటున్నారు సాత్విక్ ఇటీవల కరోనా బారిన పడడమే ఇందుకు కారణం శనివారంతో సాత్విక్ క్వారంటైన్ పూర్తయింది. మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోనున్నాడు. ఇందులో నెగెటివ్ వచ్చినా, మరో పది రోజులు ప్రాక్టీస్‌కు రాలేడు. భాగస్వామి అందుబాటులో లేకపోవడంతో చిరాగ్ కూడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. వీరి నిర్ణయానికి బాయ్ కూడా ఓకే చెప్పింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here