

లాక్డౌన్ పుణ్యమా అని పెళ్లిలా మోత మోగుతుంది, ఇలా చేసుకున్న వారిలో టాలీవుడ్ సినీ తారలు కూడా చాలా మండే ఉన్నారు నిఖిల్, నితిన్‌లు ఇలా . ఇంతే కాకుండా పెళ్లి పై మొగ్గు చూపుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోయింది, కానీ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం అందరి కన్నా వేరుగా ఆలోచిస్తున్నాడు. సాయి తెలుగులో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను చేస్తున్నాడు టాలీవుడ్ లో ప్రభాస్ తరువాత అంతటి ఫేమ్ ను రాణించే అవకాశాలు సాయికే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సాయి. పెళ్ళి విషయం రాగానే మరో ఐదేళ్ళ పాటు ఆ ఆలోచన లేదని అన్నాడు . దీనితో పాటు గా చిత్రవిచిత్రమైన లాజిక్లను చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇంకా గట్టిగా అడిగితె తన కంటే అల్లశిరీష్ పెద్దవాడని అతడికి అయిన తరువాత తన పెళ్ళి గురించి ఆలోచిస్తానని చెప్తున్నాడు. ప్రేమ పెళ్ళి మాత్రం చేసుకొనని, పెళ్ళ చేసుకుంటే పెద్దలు కుదిర్చేదె అవుతుందని చెబుతున్నాడు. ఇదే కాకా తాను బ్యాచిలర్‌గా ఉండబట్టే లాక్డౌన్ ఎంజాయ్ చేయగలిగానని, పెళ్ళైతే జీవితం మొత్తం లాక్డౌన్ అవుతుందని తెలిపాడు.