మంచి, చెడుకు మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంలో సడక్-2

0
88
sadak2

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, ఆదిత్యారాయ్‌కపూర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం సడక్‌-2. మహేశ్‌భట్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సడక్‌ (పార్ట్‌-1)లో సంజయ్‌ క్యాబ్‌ నడుపుతున్న సీన్‌ తో షురూ అయ్యే ట్రైలర్‌..థ్రిల్లర్‌ కథాంశంతో సాగుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచి, చెడుకు మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఆగస్టు 28న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో పూజాభట్‌, అలియాభట్‌ కీలక పాత్రల్లో నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ట్రైలర్‌ కొన్ని కారణాల ఆలస్యమైంది. సంజయ్‌దత్‌ స్టేజ్‌-3 లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడ్డ విషయం తెలిసిందే. సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంలో కూడా సంజయ్‌దత్‌ మరోసారి క్యాబ్‌ డ్రైవర్‌ గా కనిపిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here