ఆర్ ఆర్ ఆర్ కోసం న్యూ లొకేషన్స్ కోసం వేట మొదలెట్టిన రాజమౌళి …!

0
44

దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ లో మొదటిసారి ఎప్పుడు పడని ఇబ్బందులు పడుతున్నాడు. ఒక సినిమాను స్టార్ట్ చేస్తే అలుపు లేకుండా పని చేసే రాజమౌళి కరోనా కారణంగా ఎటు వెళ్లాలని పరిస్థితి ఏర్పడింది. 450 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాత తర్వాత ఆ స్థాయిలో టెన్షన్ పడేది దర్శకుడు మాత్రమే. లాక్ డౌన్ అనంతరం షూటింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. దింతో కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పడం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన 30 % షూటింగ్ పనులను పూర్తి చేయాలిసి ఉంది. అయితే నెక్స్ట్ ఏ మాత్రం ఛాన్స్ దొరికినా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ముందుగానే లోలేషన్స్ కోసం వేట మొదలుపెట్టాడు. పూణేలో ఒక లొకేషన్ లో చేయాలని అనుకున్న షూటింగ్ పార్ట్ ని ఇప్పుడు తెలంగాణకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. నల్గొండ కోటలు అయితే కరెక్ట్ గా సెట్ అవుతాయని తెలుసుకున్న రాజమౌళి షూటింగ్ ని ఇక్కడే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ తో పాటు … అజయ్ దేవగన్ కూడా నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్కొబోతున్నట్లు సమాచారం. మరి నెక్స్ట్ షెడ్యూల్ ని రాజమౌళి ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here