రాజమౌళి కి షాక్ ఇచ్చిన RRR హీరోస్ …!

0
65

రాజమౌళి బాహుబలి అనంతరం అత్యతంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నచిత్రం RRR. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా 400కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అన్ని సినిమా ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇలాంటి సినిమా ప్రస్తుతం ఆగిపోవడానికి కారణం హీరోలే అని తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చినా కూడా షూటింగ్ కి రాలేమని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారట. సాధారణంగా రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తే చాలు.. అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఆయన సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే నటీనటులు ప్రాణాలు పెట్టేస్తారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ప్రాణాలు పణంగా పెట్టలేమని ఇద్దరు హీరోలు చేతులెత్తేశారట. RRR సినిమాలో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో రాజమౌళి కి విలన్స్ లా మారినట్లు తెలుస్తుంది. ఎందుకంటే కరోనా వైరస్ ఉన్నప్పటికి గత కొన్ని రోజులుగా పెర్మిషన్స్ కోసం సినీ పెద్దలతో కలిసి ప్రభుత్వ అధికారులతో రాజమౌళి చర్చలు జరిపాడు. జాగ్రత్తగా షూటింగ్స్ చేసుకోవాలని ప్లాన్ కూడా చేసుకున్నాడు. అయితే హెల్త్ కిట్స్ ఎమర్జెన్సీ కీట్స్ ఎన్ని పెట్టినా కూడా చాలా వరకు కొంతమంది షూటింగ్స్ నిర్వహించడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. అదే తరహాలో రిస్క్ చేయవద్దని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్లాన్ చేసుకొని రెడీ అవ్వగా షూటింగ్స్ కి రాలేమని RRR హీరోలు డైరెక్ట్ గా చెప్పేశారట. 400 కోట్ల ప్రాజెక్ట్ కావడంతో షూటింగ్ ఇంకా ఆలస్యం కాకూడదని రాజమౌళి తెగించినా కూడా హీరోస్ ఒప్పుకోకపోవడంతో కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తుంది. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా షూటింగ్ కి రాలేనని ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. మరి ఇలాంటి పరిస్థితిలో రాజమౌళి ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here