బిగ్ బాస్ 4 : గెస్ట్ హోస్ట్ గా సీనియర్ హీరోయిన్ రోజా ..!!

28
Roja Guest Role In BB-4
తెలుగు బిగ్ బాస్ గత సీజన్ వీకెండ్ లో నాగార్జున అందుబాటు లో లేక పోవడం వల్ల రమ్య కృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఆమె గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ కు రెస్పాన్స్ మంచిగా వచ్చింది . ఈ సీజన్ లో కూడా మరో సారి గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ గత వారం చాలా బలంగా పుకార్లు వచ్చాయి .  వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున విదేశాలకు వెళ్లారని ఆయన ఒక్క రోజు షూటింగ్ కోసం తిరిగి రావడం చాలా రిస్క్ తో కూడుకున్న పని కనుక ఈ వారంకు సంబంధించి వీకెండ్ ఎపిసోడ్స్ ను గెస్ట్ హోస్ట్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.  తీరా చూస్తే పోయిన వారం వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జుననే కనిపించాడు.  పుకార్లన్నింటికి చెక్ పెట్టినట్లయ్యింది.
గత వారం జరిగిన చర్చ మళ్లీ ఈవారం జరుగుతోంది.  ఈసారి ఇంకాస్త బలంగా పుకార్లు వస్తున్నాయి .  నాగార్జున సినిమా షూటింగ్ కోసం మనాలీలో ఉన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చే అవకాశం లేదని అందుకే ఈ వారంలో ఖచ్చితంగా గెస్ట్ హోస్ట్ ను ప్రేక్షకులు చూడబోతున్నారు అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
 గెస్ట్ హోస్ట్ ఈసారి రమ్యకృష్ణ కాదని.. హీరోయిన్ కమ్ ఎమ్మెల్యే కమ్ బుల్లి తెర షో హోస్ట్ అయిన రోజా ఈ వీకెండ్ ఎపిసోడ్ ను హోస్ట్ చేయబోతున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. నేడు రెండు ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.  షూటింగ్ ప్రారంభం అయ్యి ఉంటుంది. మరి కాసేపట్లో ప్రోమో వచ్చే అవకాశం ఉంది.  గెస్ట్ హోస్ట్ వార్తలు నిజమేనా రోజా గారు హోస్ట్ గా దుమ్ము లేపబోతున్నారా లేదంటే గత వారం మాదిరిగానే పుకార్లేనా అనే విషయం ఇంకా కాసేపట్లో  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here