నేరుగా ధోని వద్దకే వెళ్ళండి…!

0
111
Captain Cool

భారత క్రికెట్ అభిమానులు గత ఆరేడేళ్ళగా మాట్లాడుకుంటున్న మాటలు ఎక్కువ ధోని గురించి, ధోని భవితవ్యం గురించి. ఆటలో మిస్టర్ కూల్ గా వ్యవహరించే ధోని ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా.. భవిష్యత్తు గురించి తనకేమి బెంగ లేదన్నట్లుగా కూల్ గానే వ్యవహరిస్తున్నాడు. కానీ ఇక ధోని క్రికెట్ ఆడతాడా లేదా అన్న అతృతతో మాత్రం ఉన్నారు. ధోని కూల్ గా వ్యవహరించే వైఖరి తోటి క్రికెటర్లకు కూడా విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి. తాజాగా ధోని అభిమాని ఒకరు రోహిత్ శర్మను ధోని ఆడతాడా లేదా అన్న మాటను అడుగగా రోహిత్ చెప్పిన సమాధానమే ఇందుకు ఉదాహరణ.

కరోనా వ్యాప్తి నేపథ్యంగా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న రోహితశర్మ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్‌లో పాల్గొని క్రికెట్ కు సంబందించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ఇతను కెవిన్ పీటర్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్‌‌తో లైవ్ సెషన్స్ లో పాల్గున్నాడు. తాజాగా ఇతను సీనియర్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లోపాల్గొనగా దీనిలో భాగంగా అభిమానులు కూడా ఈయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు రోహిత్ సమాధానమిచ్చాడు. ధోని భవిష్యత్తులో ఆడతాడా లేదా అనే విషయం ఫై ప్రశ్నించగా ధోని క్రికెట్ ఆడడం ఆపేస్తే ఎక్కడికి వెళ్ళిపోడు రాంచీలోని ఉంటాడు. మీరందరు ఒక పని చేయండి. లాక్ డౌన్ ముగిసాక ఒక కారో లేదా బైకు గాని కొనుక్కుని నేరుగా ఈ ప్రశ్న ధోనిని అడగండి అని మాకైతే ధోని గురించి ఏమి తెలియదు. వరల్డ్ కప్ తరువాత మాకు ధోని నుంచి ఏ సమాచారం లేదు. కనీసం ఆడతాడో లేదో ఐడియా కూడా లేదు. కనుక మిరే అయన ఇంటికి వెళ్లి కనుక్కోండి అని సమాధానమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here