మళ్లీ మైదానంలో దిగనున్న సచిన్..

34
road-safety-world-series-2021

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ మళ్లీ మైదానంలో దిగనున్నారు. రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌ టీ20 టోర్నీ సందర్భంగా అతను రంగంలోకి దిగుతున్నాడు. మార్చి 2న రాయ్‌పుర్‌లో మొదలు కానున్న ఈ టోర్నీలో తెందుల్కర్‌తో సహా మాజీ దిగ్గజ ప్లేయర్స్ బ్రియాన్‌ లారా, వీరేంద్ర సెహ్వాగ్, ముత్తయ్య మురళీధరన్ తదితరులు పాల్గొంటున్నారు.

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌ దేశాలనుండి మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో మెరవనున్నారు. గతేడాది మార్చిలో నిర్వహించిన తొట్టతొలి రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌ను నాలుగు మ్యాచ్‌లు ముగిసాక కరోనా కారణంగా నిలిపివేశారు. ఈ టోర్నీలోని మిగిలి ఉన్న మ్యాచ్‌లను రాయ్‌పుర్‌లో కొత్తగా కట్టిన షహీద్‌ వీర్‌ నారాయణ్‌సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here