హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తమిళ్ విలన్ … అంతా RRR మహిమ …!

0
63

టాలీవుడ్ ఇండస్ట్రీ లో పరభాషా నటులకు వచ్చే అవకాశాలు ఇంకెక్కడా రావనే చెప్పాలి. మన నటీనటులు బయట ఎంతవరకు క్లిక్కవుతారో చెప్పలేము గాని టాలెంట్ ఉండే తమిళ్ యాక్టర్స్ మాత్రం ఇక్కడ నుంచి క్రేజ్ అందుకుంటారు. తమిళ్ సినిమా హీరోలకు తెలుగు లో ఏ రేంజ్ లో మార్కెట్ సెట్టయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేసే వాళ్ళు అలాగే విలన్స్ కూడా  క్లిక్కవుతున్నారు. గతంలో కూడా చాలా మంది తమిళ్ యాక్టర్స్ తెలుగు సినిమాల్లో నటించారు. కానీ ప్రస్తుత రేంజ్ లో అయితే రెమ్యునరేషన్ అందుకోలేదు. గత కొంత కాలంగా టాలీవుడ్ లో తమిళ నటుడు సముద్రఖని మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. దర్శకుడిగానే కాకుండా ఒక మంచి నటుడిగా సముద్రఖని బిజీ అవుతున్నాడు. తెలుగులో మొదట అల వైకుంఠపురములో సినిమాలో విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే సముద్రఖని రేంజ్ పెరిగిపోయింది. టాలీవుడ్ ఆడియన్స్ అతను యాక్టింగ్ కు కనెక్ట్ అయ్యారు. దీంతో తెలుగులో గ్యాప్ లేకుండా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. కానీ ఈ స్టార్ యాక్టర్ మాత్రం కేవలం తనకు నచ్చిన సినిమాలే చేస్తున్నాడు. సముద్రఖని శంభో శివ శంభో సినిమాతో పాటు నాని జెండాపై కపిరాజు అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక నెక్స్ట్ రవితేజ క్రాక్ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సముద్రఖని RRRలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. RRR సినిమా కోసం సముద్రఖని రూ.2కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలే కాకుండా నటుడిగా మరిన్ని తెలుగు ఆఫర్స్ వస్తున్నాయట. కానీ సముద్రఖని తనకున్న క్రేజ్ ని చెడగొట్టుకోకుండా కేవలం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడట. ఇక RRR ద్వారా ఈ స్టార్ యాక్టర్ రెమ్యునరేషన్ కూడా ఓ వర్గం హీరోల రేంజ్ లో పెరిగింది. దీంతో దర్శకులు కూడా సముద్రఖనిని కీలక పాత్రల కోసమే సెలెక్ట్ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here