‘కీర్తిసురేష్’ ప్రచార చిత్రం విడుదల

19
KeerthySuresh

‘ప్రేమ’ తో కూడుకున్నమంచి కుటుంబ కధా చిత్రం ‘రంగ్ దే’. ఈ రోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్’ పుట్టినరోజు కావడంతో ‘రంగ్ దే’ లోని ఓ చిత్రాన్ని చిత్రం యూనిట్ విడుదల చేసింది. చిరునవ్వు చిందిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం బాగా ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే కొంత విరామం తరువాత చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో మొదలయింది. నితిన్ తో పాటు ఇతర ప్రధాన నటులు షూటింగ్‌లో పాల్గొని కొన్ని సన్నివేశాలను పూర్తీ చేశారు. షూటింగ్ కు అనువైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ పూర్తి జాగ్రత్తల నడుమ షూటింగ్ తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన అతి ముఖ్యమయిన సన్నివేశాలు, ‘ఇటలీ’ లో పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే సినిమా షూటింగ్ పూర్తీ చేసుకోనుంది. 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల మొదటి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను తెరకెక్కించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీనికి పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. అంతే కాకుండా పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు అయినా నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here