నిమ్మరసం నిత్యం తీసుకోడం వల్లా ఈ 5 వ్యాధులు మీ దరి చేరవు

87
lemon

వేసవి కాలం లో ఎండల బారి నుంచి ఉపశమనం పొందాలని అందరు  నిమ్మరసం తాగుతుంటారు. కొంతమంది నిమ్మరసాన్ని నిత్యం వంటల్లో వడుతూవుంటారు . నిజం చెప్పాలంటే రోజువారీ ఉదయాన్నే అల్పాహారం సేవించక ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి.ఎలాంటి  సీజన్ అయినా సరే.. నిత్యం ఇలా చేసినట్లయితే ఈ  5 వ్యాధులు మీ దరిచేరవు .

* జీర్ణ సంబంధిత  సమస్యల తో బాధపడుతున్నవారు అనునిత్యం నిమ్మరసం సేవించినట్లైతే చాలా మంచిది. జీర్ణ వ్యవస్థలో  లోపాలు గనుక ఉంటె  వాటిని తగ్గిస్తుంది. ఆహారం జీర్ణ క్రియ మెరుగవుతుంది . కొంతమంది నిమ్మరసం తాగితే గ్యాస్‌, అసిడిటీ వస్తుందని అపోహ పడుతుంటారు. కానీ ఇందులో నిజం ఏ మాత్రం లేదు . నిత్యం నిమ్మరసం తాగితే జీర్ణ సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాగె శరీరం లో ఉండే వ్యర్థ, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

* నిమ్మరసాన్ని నిత్యం తాగితే శ్వాస కోశ కు సంబంధించిన  సమస్యలు ఏ మాత్రం రావు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు సమస్యలు తో బాధపడడం ఉండదు. నిమ్మరసం లో  ఉండే విటమిన్ సి, మరియు వేరే పోషకాలు ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

* కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు  నిమ్మరసం సేవిస్తే ఫలితం మంచిగా ఉంటుంది . ఆరోగ్యవంతులు కూడా ఈ రసాన్ని సేవించవచ్చు . కిడ్నీ స్టోన్లు సమస్య తో బాధపడుతున్న వరు కిడ్నీ స్టోన్లు  ఏర్పడకుండా ఉంటాయి.

* అధికంగా బరువు సమస్య ఉన్నవారు రోజు  నిమ్మరసం గనుక తాగితే దాని బారిన   తప్పించుకోవచ్చు. బరువు తగ్గుతారు. అలాగే నిమ్మరసం తాగడాన్ని కొనసాగిస్తుంటే బరువు తగ్గడం లో సహాయంగా ఉంటుంది. బరువు పెరగకుండా ఉంటారు.

* డీహైడ్రేషన్ సమస్య తో బాధ పడుతున్న వారికీ  నిమ్మరసం చాలా మేలు చేస్తుంది. నిమ్మరసం తాగితే శరీరంలో ద్రవాలు సమతుల్యత  ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు.  నోరు పొడిబారకుండా చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here