టైటిల్ కొట్టకుండా వెళ్ళేదే లేదు అంటున్న కోహ్లీ ..!

0
207
IPL 2020 Auction | IPL 2020 Royal Challengers Bangalore Full Squad

వచ్చే IPL కోసం ఫ్రాంచైజీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. స్టార్ ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకుని కొందరు మంచి ఆటగాళ్లను కూడా వదిలేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆటగాళ్ల మార్పుచేర్పులు జరిగిన తర్వాత జట్లన్నీ కొంత బలంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. అయితే ఒక బలమైన జట్టు ఏదైనా ఉందా.. అంటే అన్ని బలంగానే కనిపిస్తున్నాయి! మరి మంచి స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్న రాయల్ ఛాలెంజెర్స బెంగళూరు ఈ జట్టు ఈసారి అబ్దుతమైన ఆటగాళ్లతో కుదిరింది. కోహ్లీ నాయకత్వంలోనే ఈసారి కూడా జట్టు ముందుకు సాగనుంది.

ఈసారి బెంగళూరు టీమ్ 12 మంది ఆటగాళ్లను వేలానికి విడుదలచేయగా మిగిలినవారిని అట్టిపెట్టుకుంది. ఫైనల్స్ వరకు వెళ్లిన ఈజట్టు టైటిల్ సాధించాలనే కల ఇప్పటివరకు కలగానే మిగిలిపోయింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యూహాత్మకంగా జట్టు కూర్పులను చేస్తున్నాడు, అది కూడా ట్వీట్ ద్వారా తెలిపాడు. అభిమానులకు హలో చెప్తూ.. ఇప్పటివరకు తమపై చూపిన ప్రేమ అభిమానం మున్ముందు కూడా ఉండాలని కోరాడు. ఈసారి జట్టుని మరింత బలంగా చేస్తున్నాను అని, టైటిల్ ఎలా అయినా గెలిచి తీరుతాము అని అన్నాడు.

ఈసారి బ్యాటింగ్ విభాగంలో మిస్టర్ 360 గ పిలుచుకునే ఎబి డివిలియర్స్, ఆరోన్ ఫించ్, కోహ్లీ ఉండగా వారితోపాటు ఆల్ రౌండర్లు మొయిన్ అలీ, శివమ్ దూబే, క్రిస్ మోరిస్, డేల్ స్టెయిన్, కేన్ రీచర్డ్సన్ ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో యజువేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక బ్యాటింగ్ లోనూ కీపింగ్ లోనూ దిట్ట అయిన పార్థివ్ పటేల్ కూడా జట్టుకి బలం. మరి ఈ బలమైన జట్టు బలంగా ఉన్న జట్లను ఏమాత్రం భయపెడుతుందో చూద్దాం..! ఈసారి IPL లో అయినా కోహ్లీ కల నెరవేరుతుందో లేదో?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here