రవితేజ 68కు ముహార్తం ఖరారు‌..!!

19
Ravi Teja 68 th Movie

మాస్‌ మహారాజా హీరో రవితేజ ఇటివలే క్రాక్‌ చిత్రంతో భారీ హిట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ మాస్‌ హీరో ఖిలాడీ మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు రవితేజ 68వ చిత్రం కూడా ఖరారైంది. సినిమా చూపిస్త మావ,నేను లోకల్‌, హలో గురు ప్రేమకోసమే చిత్రాల దర్శక-రచయిత ద్వయం త్రినాథరావు, ప్రసన్నకుమార్‌తో ఆయన సినిమా చేస్తున్నారు.

పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ‘ఖిలాడి’ చిత్రీకరణ పూర్తి కాగానే, రవితేజ 68వ చిత్రం ప్రారంభం కాబోతుంది.ఇది మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని నిర్మాతలు చెప్పారు. కథ-స్ర్కీన్‌ప్లే ప్రసన్నకుమార్‌ బెజవాడ అందిస్తుండగా..త్రినాథరావు నక్కిన దర్శకత్వం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here