సౌత్ నెంబర్ వన్ హీరోతో రష్మిక మందన్న … హిట్ కొడితే తిరిగే ఉండదు …!

0
79

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ గత ఏడాది వరకు గట్టిగానే కొనసాగింది. కానీ సినియర్ హీరోయిన్స్ ఇప్పుడు డీలా పడటంతో రేస్ లోకి పూజ హెగ్డే, రష్మిక మందన్న వచ్చేశారు. ఇద్దరు కూడా పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ పోటీలో పూజ హెడ్గే వరుస విజయాలతో లీడ్ లో ఉండగా ఇప్పుడు మొదటి స్థానానికి రష్మిక మందన్న వెళ్ళుతుంది. ఆమె చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప తో పాటు మరో మంచి రెండు సినిమాలు కూడా ఉన్నాయి. ఇక త్వరలో సౌత్ నెంబర్ వన్ హీరోతో కూడా వర్క్ చేయబోతుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీ లో 100 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని ఎక్కువ సార్లు అందుకున్న కోలీవుడ్ హీరో విజయ్. ఈ హీరోతో ఛాన్స్ కోసం చాల మంది ఎదురుచూస్తుండగా అదృష్టం రష్మికకు వరించింది. ప్రస్తుతం ఆమె షెడ్యూల్స్ లో తెలుగు సినిమాల తో పాటు కన్నడ మలయాళం సినిమాలు కూడా ఉన్నాయి. ఇక తమిళ్ సినిమా నుంచి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో విజయ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. మురగదాస్ దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలోనే రష్మిక హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here