స్టైల్ మార్చిన రష్మిక మందన్న…!

0
55
rashmika new look

సక్సెస్ఫుల్ గా మంచి విజయాలతో దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన్న తన మఖాం మార్చేసింది. కరోనా లాక్ డౌన్ టైంలో కూర్గ్ లోని తన ఇంట్లోనే ఉన్న రష్మిక లాక్ డౌన్ ముగియడంతోనే హైదరాబాద్ వచ్చేసింది. రీసెంట్ గా హైదరాబాద్ లో అమ్మడు ఓ సొంత ఫ్లాట్ కూడా కొనుక్కున్నట్టు తెలుస్తుంది. రష్మిక మందన్న తెలుగులో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ అమ్మడు స్టార్ సినిమాలతో దుమ్ముదులిపేస్తుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకుంది.

ఈ ఇయర్ మొదట్లో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సత్తా చాటిన రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కు జోడీగా నటిస్తుంది. తెలుగులో ఇప్పుడు ఫాంలో ఉన్న స్టార్స్ లో పూజా హెగ్దే తర్వాత స్థానంలో రష్మిక మందన్న ఉంది. ఎలాగు తెలుగులో వరుస ఛాన్సులు వస్తున్నాయని అమ్మడు ఇక్కడికే తన మఖాం మార్చేసింది.

హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో రష్మిక త్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ ఒకటి కొనేసిందని తెలుస్తుంది. ఇక్కడే ఉంటే సినిమా షూటింగ్స్ కు అందుబాటులో ఉంటుందని తెలుతుంది. పుష్ప, ఆచార్య మాత్రమే కాకుండా ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్టు టాక్. సినిమాకు కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారింది. రష్మిక సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అన్నట్టుగా టాక్ వచ్చింది. అందుకే ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here