చియాన్‌తో రాశీఖన్నా?

38
rashi-khanna-with-chiyan

బాలీవుడ్ మూవీ మెడ్రాస్ కేఫ్ తో నటనను ఆరంభించిన రాశీఖన్నా.. ఆపై తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు పొతొంది. అన్ని చోట్లా విజయాలు చవి చూసింది. సోమవారం (నవంబర్ 30) థర్టీ ప్లస్ క్లబ్ లోకి ప్రవేశించిన ఈ అందాల రాశి.. తాజాగా మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ తెలిపినట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. సామి, సామి స్క్వేర్ తరువాత చియాన్ విక్రమ్, స్టార్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతొంది. ఇందులో నాయికగా రాశీఖన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందంటున్నారు చిత్ర యూనిట్.

కాగా ప్రస్తుతం రాశి చేతిలో నాలుగు కోలీవుడ్ వెంచర్స్ ఉన్నట్టు సమాచారం. అరణ్ మణై 3, మేధావి, తుగ్లక్ దుర్బార్, సైతాన్ కా బచ్చా.. ఇలా డిఫరెంట్ జానర్ మూవీస్ లో రాశి నటించబోతొంది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్యతోనూ ఓ సినిమా చేయనుంది ఈ బ్యూటీ. దీనికీ హరినే దర్శకత్వం వహించనుండడం రాశి కి ప్లస్ కావడం విశేషం. మరి.. అరడజను అరవ సినిమాలతో బిజీ బీగా ఉన్న రాశి.. వాటితో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుందేమో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here