బ్యాంకు ముందు కోడి హల్‌చల్‌.. కేసు నమోదు…

0
137
rare incident in front of bank

అమెరికాలో వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక కోడి ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై దాడి చేస్తుంది. దానితో అక్కడి స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక పోలీసులు వారి నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి ఆ కోడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంగా పోలీసులు సదరు కోడి జాడ తెలిసిన వారు దాని ఆచూకీ చెప్పాలంటూ కోడి ఫోటోను శుక్రవారం ఫేసుబుక్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ పోస్ట్ లో మాస్క్ తో ఉన్న కోడి ఫోటో ను పెట్టి పోలీసులు ఈ విధంగా రాసుకొచ్చారు. ఈ ఫొటోలోని కోడి గత కొద్దిరోజులుగా లూసియాన బ్యాంక్‌ ఏటీఎం వద్దకు వచ్చి పోయే వారిమీద దాడి చేస్తుంది. అంతే కాకుండా రోడ్డుపై వచ్చే పోయే కార్ల మీద ఎగబడుతూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది.

ఇక దీని వలన బాధకు గురైన వారి పిర్యాదు మేరకు కోడి ఆచూకీ కొరకు దర్యాప్తు చేపట్టాము. ఇక ఈ కోడి జాడ గనుక తెలిస్తే మాకు తెలియజేయండి అని రాసారు. కాగా ఇప్పటివరకు ఈ పోస్టుకు లక్షల్లో వ్యూస్ రాగా వేలల్లో కామెంట్లు వచ్చాయి. కోడిపై కేసు అంటే నమ్మబుద్దికావటం లేదే ఇది నిజమేనా లేక మీరే క్రియేట్‌ చేశారా? అని కొంతమంది పోలీసులను ఎదురు ప్రశ్నలు అడిగారు. దీని గురించి బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ కోడిపై పిర్యాదు అందించిన కొద్దీ క్షణాల్లోనే పోలీసులు వచ్చేసారు కానీ పోలీసులు వచ్చేసరికి కోడి అక్కడి నుండి తప్పించుకుంది. ఇక ఆ కోడినుండి సమీపంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ గనక అది కనిపిస్తే సమాచారం అందచేయండి అని పోలీసులు సూచించారని బ్యాంక్ అధికారులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here