రాణ్‌వీర్ సింగ్ 83 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

22
83 Movie Release Date Fix

బాలీవుడ్  డైనమిక్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అతడు చేస్తున్న తాజా చిత్రం 83. ఈ సినిమాను భారత సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ లో  రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం రణ్‌వీర్ క్రికెట్ శిక్షణ తీసుకున్నారు. కపిల్ దేవ్ స్పెషల్ షాట్లని  అలానే కొట్టగలగాలని ఎంతగానో శ్రమించారు.

తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా జూన్4న ప్రేక్షకుల ముందుకు వస్తుందంట.  ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తీస్తున్నారు.ఈ చిత్రాన్ని కబీర్ ఖాన్ దర్శకత్వంలో దీపికా పదుకొనె కబీర్ ఖాన్, సాజిద్ నడియాద్వాలా, విష్ణువర్థన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వాళ్ళు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.  రణ్‌వీర్ వాళ్ళ  అంచనాలను ఎంత వరకు అందుకుంటారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here