ఈ రోజుతో రానా సినీ ప్రయాణానాకి 11 ఏళ్లు..

23
rana-daggubatis-completes-11-years-of-cinematic-journey

యంగ్‌ హీరో రానా దగ్గుబాటి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 11 ఏళ్లు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్‌ సినిమాతో హీరోగా అడుగుపెట్టిన రానా..తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2010, ఫిబ్రవరి 19న రిలీస్ ఐన లీడర్‌ సినిమా వచ్చి ఈ రోజుకి సరిగ్గా 11 ఏళ్ళు. ఈ సందర్భంగా రానా భార్య మిహిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భర్త రానాకు విషెస్‌ అందించింది. లీడర్‌ పోస్ట్‌ర్‌ను షేర్ చేసి.. ‘హ్యాపీ 11 ఇయర్స్ జర్నీ.. మై డార్లింగ్ రానా` అంటూ లవ్లీ విషెస్‌ అందజేసింది.

ఇక ఆగస్టు 8 వ తేదీన హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో రానా మిహికా బజాజ్‌ ను వివాహం చేసుకున్న సంగతి. కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితులు హాజరవగా నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ఇక, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ రానాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. నటుడిగా 11ఏళ్లు పూర్తి ఐన సందర్భంగా రానాకు స్పెషల్‌ విషెస్‌ అందజేస్తూ ట్వీట్‌ చేసింది. రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here