తల్లి కల నెరవేరబోతుందన్న చరణ్…!

0
61
Ramcharan given clarity on Acharya Movie

మెగా తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం క్రేజీ హీరోగా మారిపోయాడు. యూత్ లో మరియు మెగా ఫాన్స్ లో అంత క్రేజ్ కు కారణం అతను సినిమా సినిమాకి తన లుక్ ని బాడీ లాంగ్వేజ్ ని మార్చేసి ప్రేక్షకులని తనవైపు తిప్పుకుంటాడు. ఈ విషయం లో బన్నీ కూడా ముందుంటాడనుకోండి. అది పక్కనపెడితే… చెర్రీ తాజాగా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన RRR లో నటిస్తుండటం. ఇందులో మరో హీరో చెర్రీ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన యంగ్ టైగర్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు వీరిద్దరి ఫాన్స్. మరి ఆ చిత్రం తరువాత చెర్రీ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడని అంటున్నా ఇప్పటిదాకా దాని మీద క్లారిటీ లేదు. ఎట్టకేలకు ఆచార్య సినిమాలో అతిథి పాత్రను ఎవరు చేయబోతున్నారు అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు చరణ్.


ఈ అతిథి పాత్ర చేసేది ఎవరో కాదు తానేనని ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ఆచార్యలో 30 నిమిషాల నిడివిగల అతిథి పాత్ర చేస్తున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అలానే ఈ సినిమాతో నన్ను నాన్నని ఒకే తెరపై చూడాలనుకున్న తన తల్లి కూడా నెరవేర బోతుంది అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రామ్ చరణ్. దీంతో ఇప్పటి దాకా ఈ సినిమా విషయంలో టెన్షన్ పడిన మెగా ఫ్యాన్స్ అందరి టెన్షన్ చరణ్ తీర్చేసాడని చెప్పచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here