చిరంజీవి దంపతులకి రామ్ చరణ్ విషెస్ ..!!

24
Ram Charan Wishes Chiranjeevi Couple

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు చిరంజీవి దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, సురేఖ కొణిదెల 42వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా చరణ్ తన శుభాకాంక్షలను తెలిపారు.  మెగాస్టార్ దంపతుల ఫోటోని  చరణ్  ట్వీటర్‌లో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు  ఈ శుభదిన సందర్భంగా మెగాస్టార్ దంపతులకు కామెంట్ల ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపుతున్నారు. తాజాగా చిరు చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం సినిమాలు ఉన్నాయి. ఆ తరువాత దర్శకుడు బాబీతో  ఓ సినిమా చేయనున్నారు.    చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత శంకర్ డైరెక్షన్‌లో తన నెక్స్ట్ చిత్రాన్ని ప్లాన్ చేశారు. వీరిద్దరు ఆచార్య సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here