

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో పర్యటించారు. దీనిలో భాగంగా ఆయన ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయన్ను ప్రశ్నలడిగేందుకు ఆసక్తి చూపించారు. ఈ సమయంలో రాహుల్ గాంధీని విద్యార్థులు సార్… సార్… సార్… అంటూ పిలిచారు. ఇంతలో రాహుల్ విద్యార్థులతో “ఓ సారి నా మాట వినండి. నా పేరు రాహుల్. సార్ కాదు. నన్ను రాహుల్ లేదంటే అన్నా అని పిలవండి. అదే నాకు బాగుంటుంది. మీ ప్రిన్సిపాల్‌ను మాత్రం సార్ అని పిలవండి.” అని రాహుల్ చమత్కారంగా మాట్లాడారు. పుదుచ్చేరిలో తలెత్తిన రాజకీయ పరిణామాల కారణంగా రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో పర్యటించారు.