

అమ్మఒడి పథకం కింద వచ్చే ఏడాది నుంచి డబ్బులకు బదులు. ల్యాప్టాప్ ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. సోమవారం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ. తొమ్మిదోతరగతి దాటిన వారు, వసతిదీవెన లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ‘అమ్మఒడి’ పథకం వర్తిస్తుందని తెలిపారు. గతంలో ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో వసతులు దారుణంగా ఉండేవని చెప్పారు. గత ప్రభుత్వం బడులను దిగజార్చి, ప్రైవేటు బడులను ప్రోత్సహించిందన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని జగన్ పేర్కొన్నారు. చదువుకునే పిల్లలంతా బడి బాట పట్టాలని సీఎం జగన్ తెలిపారు.