ప్రభాస్ కొత్త లుక్..!!

21
Prabhas New Look Going Viral

రెబల్ స్టార్ ప్రభాస్ లైన్ గా సినిమాలతో బిజీగా ఉన్నాడు. భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. `రాధేశ్యామ్’, `సలార్’, `ఆదిపురుష్`సినిమాలతో బిజీగా ఉన్నాడు.రీసెంట్ గా బయటకి వచ్చిన ప్రభాస్ లుక్ బాగా వైరల్ అవుతోంది.

కోర మీసాలతో స్మార్ట్‌లుక్‌తో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు.`ఆదిపురుష్`లో రాముడి పాత్ర కోసమే ప్రభాస్ మీసకట్టు మార్చాడని ఫాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది`రాధేశ్యామ్ సినిమాతో ఫ్యాన్స్‌ని ప్రభాస్ పలకరించనున్నాడు.

జూలై 30న ఈ సినిమా విడుదల కాబోతోంది. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ  పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటీవలే విడుదలైన `గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్` ఆకట్టుకుంది.ప్రభాస్ ప్రస్తుతం `సలార్` చిత్రీకరణకు హాజరవుతున్నాడు. త్వరలో `ఆదిపురుష్` షూటింగ్‌ను  ప్రారంభించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here