అన్నిటికీ తెగిస్తేనే అక్కడ రాణించగలం…!

123
Pooja Hegde

బుట్టబొమ్మ పూజా హెగ్దే బాలీవుడ్ లో రాణించాలంటే అన్నీ వదులుకోవాల్సిందే అంటుంది. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న పూజా హెగ్దే ఇక్కడ వరుస ఛాన్సులు అందుకుంటుంది. బన్నీ డీజే సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఆ సినిమా నుండి తనలోని హాట్ యాంగిల్ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరో సినిమా అంటే చాలు ముందు పూజా హెగ్దేని అడిగిన తర్వాతే మరో హీరోయిన్ దగ్గరకు వెళ్లే పరిస్థితి వచ్చింది.

ఇక ఇదిలాఉంటే టాలీవుడ్ లో టాప్ లేపేసేలా ఛాన్సులు అందుకుంటున్న అమ్మడు బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంది. అయితే బాలీవుడ్ లో రాణించాలంటే అన్నీ వదులుకోవాల్సిందే అని అంటుంది పూజా హెగ్దే. మరి దాని అర్ధం ఏంటో ఆమెకే తెలియాలి. అఫ్కోర్స్ బాలీవుడ్ లో స్టార్ అవడం అంత తేలికైన పని కాదు. గ్లామర్ షో విషయంలో కూడా అడ్డు చెప్పకూడదు. అలా ఆలోచించి ఒకవేళ పూజా హెగ్దే ఆ కామెంట్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

ప్రస్తుతం పూజా హెగ్దే ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటిస్తుంది. అంతేకాదు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో కూడా పూజా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పూజా హెగ్దే తెలుగుఓ మాత్రం తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటుంది. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా ఆ తర్వాత స్టార్ గా ఎదిగింది పూజా హెగ్దే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here