వాహనదారులకు పోలీసుల హెచ్చరిక

15
Traffic Police

బుల్లెట్ బైక్ లు అంటే యూత్ లో ఫుల్ క్రేజ్ఉంటుంది . బైకుల కు సైలెన్సర్ల లో మార్పులు చేసి మరీ భారీ శబ్ధం వచ్చేలా చేస్తారు . ఇప్పుడు ఈ సౌండ్ వారికి చిక్కులు ని  తెస్తుంది. భారీ శబ్ధం చేస్తూ రోడ్ల మీదకు వచ్చారో  మీ బుల్లెట్ సీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా భారీగా జరిమానా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరికీ నచ్చినట్లు వారు సైలెన్సర్లలో మార్పులు చేసి రోడ్ల మీద  తిరుగుతూ శబ్ద కాలుష్యానికి కారణం అవుతూ ఉన్నవాళ్లను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేసారు.  దూసుకొని వెళ్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు అందుకుంటున్నారు .. స్పెషల్ డ్రైవ్ ను  చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు  ఈ నెల 6 నుంచి 9వ తేదీల  మధ్య తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది . ఈ నాలుగు రోజుల సమయం లో 550 బుల్లెట్లను సీజ్ చేయడం జరుగుతుంది .. సౌండ్‌ ఎక్కువ వచ్చేలాగా మార్చిన వాహనాల ను గుర్తించి కేసులు ను  నమోదు చేసి సీజ్ చేయడమే కాదు .. సైలెన్సర్లను తొలగించి  తర్వాత రవాణా శాఖ అధికారులకు బాధ్యత అప్పగిస్తున్నారు.

అయితే, ఇక్కడ పోలీసుల జరిమానా విధించడమే కాకుండా.. రవాణా శాఖాధికారులు కూడా చలానాలు రాస్తున్నారు.. దీంతో.. ఒక్కో బుల్లెట్‌కు రూ.2 వేల నుంచి రూ.10 వేల మధ్య జరిమానా పడుతోంది. బుల్లెట్ బాబులు జాగ్రత్త మరి.. వాహనం సీజ్ అవడంతో పాటు జేబుకు చిల్లు పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here