

పిస్తా పప్పు వల్ల పెద్ద పెద్ద వ్యాధులను కూడా మన దరికి చేరకుండా అడ్డుకోవచ్చు. పిస్తా పప్పు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. దీని రేటు ఎక్కువగా ఉండటం వలన కూడా చాలామంది దీని జోలికి పోరు. కానీ దీని విలువ తెలిసినవారు దీనిని వదలరు. అప్పుడప్పుడైనా తీసుకుంటుంటారు. అనేక రకాల వ్యాధుల నిర్మూలనకు ఇది తోడ్పడుతుందని చెప్తుంటారు.
ప్రపంచంలో వున్న వ్యాధులలో కొలోన్ క్యాన్సర్ (పెద్ద ప్రేగు క్యాన్సర్) కూడా చాలా ప్రమాదకరమైన వ్యాధి రీసెంట్ గా కొలోన్ క్యాన్సర్ సమస్యతో ప్రముఖ హాలీవుడ్ నటుడు “బ్లాక్ పాంథర్” సినిమాలో నటించిన “చాడ్విక్ బొస్మాన్” మరణించిన సంగతి తెలిసిందే.
ఫైబర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన కొలోన్ కాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. కేలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ లో పిస్తాపప్పును కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ ప్రక్రియకు సహకారం లభిస్తుందని అదే సమయంలో బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది.
పిస్తాపప్పు రెగ్యులర్ గా తీసుకోవడం వలన కాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. అంతేగాక ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారికి కూడా పిస్తా పప్పు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారపదార్దాలలో ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ అయినా తీసుకోవడం ఎంతో మంచిది.