మళ్లీ పెరిగిన పెట్రోల్‌ డీజిల్ ధరలు..!!

8
Petrol Diesel Prices

దేశంలో పెట్రోలు, డీజిల్ ధర, రెండు రోజుల విరామం తరువాత, మంగళవారం రోజు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలుపై 36 పైసల వరకు, డీజిల్ పై 38 పైసల వరకూ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం ప్రకటించాయి.ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.93కు చేరగా, డీజిల్ ధర రూ. 81.32కు పెరిగింది.

హైదరాబాద్ విషయానికి వస్తే, లీటరు పెట్రోలు ధర రూ. 94.54కు డీజిల్ ధర రూ. 88.69కి చేరింది. బెంగళూరులో పెట్రోలు ధర రూ. 93.98కి, డీజిల్ ధర రూ. 86.21కి చేరింది.  54 రోజుల్లో 25 సార్లు ధరలు పెరగడంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here