బంగారు వెండి నాణేలు కోసం ఎగబడ్డ జనం

14
gold coins

బంగారం, వెండి నాణేలు లభ్యమయ్యాయన్న వార్త క్షణాల్లో అందరికీ చేరింది. ఇంకేముంది అంతా తమకు కూడా నాణేలు దొరుకుతాయో అనే ఆశతో పరుగులు తీశారు. నదిలో నాణేల కోసం గాలింపు చేపట్టారు. అక్కడక్కడ తవ్వకాలు కూడా జరిపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే. ఎనిమిది రోజుల క్రితం కొంతమంది మత్స్యకారులకు రాజ్‌ఘర్ జిల్లాలోని పార్వతి నదితో బంగారు, వెండి నాణేలు లభించాయి. ఈ వార్త క్రమంగా అందరి చెవుల్లో పడిపోయింది. దీంతో రాజ్‌ఘర్ జిల్లాలోని శివపుర, గరుద్‌పూరా గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్వతి నది పరిసర ప్రాంతాలకు చేరుకుని నాణేల కోసం వేట ప్రారంభించారు. నీళ్లలోకి దిగి కొందరు బురద ఎత్తిపోస్తూ నాణేల కోసం వెతుకుతుండగా ఒడ్డునే ఉన్న బురద పెల్లలను తొలగిస్తూ మరి కొందరు ఆ నాణేల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here