2% ఛార్జీ వసూలు చేయనున్న పేటీఎం..

34
Paytm

క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం కస్టమర్లు తమ ఈ-వ్యాలెట్‌కు డబ్బులు యాడ్ చేసుకుంటే 2 శాతం ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా ఈ-వ్యాలెట్లలోకి నెలకు రూ.10వేలకు మించి వేసినట్లు అయితే రెండు శాతం ఫీజు చెల్లించలసి వస్తుంది. క్రెడిట్ కార్డు ఉపయోగం పై వ్యాలెట్ టాపప్ చేసుకుంటే చాలు ఛార్జ్ వర్తిస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా నగదును జత చేసుకుంటే రెండు శాతం నామినల్ ఛార్జీ ఉంటుంది , మీ బ్యాంకు ‌కు అధిక ఛార్జీలను చెల్లించవలసి వస్తోందని తెలిపారు.

మీ వ్యాలెట్లకు నగదును  ఉచితంగా  పంపించుకోవడానికి యూపీఐ లేదా డెబిట్ కార్డులను,నెట్ బ్యాంకింగ్  ఉపయోగించాలి అని  పేటీఎం కస్టమర్లకు ఓ సూచనా ను పంపించింది. బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు పేటీఎం వ్యాలెట్‌లోకి ఫీజును వసూలు చేస్తున్నాయని, క్రెడిట్ కార్డు వినియోగదారులు అలా జత చేస్తే రెండు శాతం ఛార్జ్ విధించబడుతుందని తెలిజేసింది. కాగా, క్రెడిట్ కార్డు తో కనీసం రూ.50 చొప్పున రూ.200 నగదు జత చేస్తే రెండు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చునని కూడా తెలిజేసింది.

పండుగ సీజన్ అవ్వడంతో  చాలా కంపెనీలు తమ ప్రోడక్ట్ ల పై ఆపర్లు ఇస్తున్నాయి. కరోనా కారణంగా సేల్స్ పడిపోయాయి. ఈ పండుగ సీజన్లో క్యాష్ చేసుకోవాలని కంపెనీలు అన్ని  భావిస్తున్నాయి. ఈ సందర్భం లో పేటీఎం కూడా వ్యాలెట్ నుండి బ్యాంకు అకౌంట్‌కు మనీ ట్రాన్సుఫర్ చేస్తే విధించే 5 శాతం ఛార్జీని ప్రస్తుతం మాఫీ చేసిందని పేటీఎం ప్రతినిధులు తెలిజేశారు. వ్యాలెట్‌లోని మొత్తాన్ని మరొక వ్యాలెట్ లేదా బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆన్‌లైన్ క్యూఆర్ కోడ్ వల్లా చెల్లింపులు జరపడానికి, బిల్లు చెల్లింపుల ప్రాసెస్ కోసం, రీఛార్జీల కోసం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా లభిస్తాయని తెలిజేశారు.

2017 నుండి పేటీఎం క్రెడిట్ కార్డుల ద్వారా వ్యాలెట్‌లోకి డబ్బును జత చేసినట్లు అయితే ఛార్జీ వసూలు చేస్తోంది. కానీ కస్టమర్ల ఒత్తిడి  తో  దానిని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఇంకోసారి దానిపై ఛార్జీ వసూలు చేయడం మొదలు పెట్టింది. అనవసరపు ట్రాన్సాక్షన్స్‌ను అరికట్టాలని పేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here