సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్.

29
Pawan Kalyan wishes CM KCR a happy birthday.by mirchipataka

తెలంగాణ  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. తాను అభిమానించే సమకాలీక రాజకీయవేత్తలలో కేసీఆర్ గారు కూడా ఒకరన్నారు పవన్ కళ్యాణ్. దార్శనికత, ధృడ సంకల్పం ఆయనలో పుష్కలంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన రాజకీయ శైలిని నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు. ప్రజలందరూ  సంతోషంగా ఉండడానికి ఆయన అమలుపరిచే విధానాలు, వాటి సరళి ఎంతో ప్రభావితం చేస్తాయని అన్నారు. ఆయనకు ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ఇమ్మని  ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here