రాబిన్ హుడ్ పాత్రలో పవన్ కళ్యాణ్..!

0
156
Powerstar Pawan Kalyan All Set For Robin Hood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది అభిమానుల ఆరాధ్య దైవం. అయన కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి జనసేన అనే పార్టీ పెట్టి పూర్తి రాజకీయాల వైపు వెళ్లిపోయారు। కానీ వారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని వదలకుండా వారితో పాటు అభిమానులు కూడా రాజకీయాలలో వారికి తోడుగా ఉన్నారు. ప్రస్తుతం అయన పార్టీ మనుగడ కోసం మరలా సినిమా బాట పట్టారు.

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వం లో పింక్ రీమేక్ వకీల్ సాబ్ పేరుతొ రీ ఎంట్రీ తో వస్తున్నారు. అదే విధంగా ఈ సినిమా తో పాటు క్రిష్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నారు. ఇప్పటికి కీలక సన్నివేశాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదట ఏప్రిల్ రెండవ వారం కల్లా పూర్తి చేయాలనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ ప్రకారం షూటింగ్ జరగలేదట. దాంతో పూర్తి షూటింగ్ ను పూర్తి చేయటానికి మరో నెల పడుతుందట. కానీ కరోనా దెబ్బకి ప్రస్తుతం సినిమాలు షూటింగ్ ఆపేసిన సంగతి తెలిసిందే.

కాగా ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వకీల్ సాబ్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here