త్రివిక్రమ్ సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్…

0
123
Pawan Kalyan and Trivikram combination

టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్స్ పై ఉండే అంచనాలు కొన్నిసార్లు అకాశాన్ని దాటేస్తాయి. అంచనాల డోస్ ఎంత పెరిగినా కూడా సినిమా రిలీజ్ అయ్యేవరకు రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో చెప్పలేము. కొన్ని కాంబినేషన్స్ అయితే ఎవరు ఊహించని రిజల్ట్ అందుకుంటాయి. అందులో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి.జస్ట్ ఒక కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటే చాలు అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి.

త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్కాంబినేషన్ అనేసరికి పక్క సినిమా ఇండస్ట్రీలు కూడా ఆ క్రేజ్ పై ఒక లుక్కేయకుండా ఉండలేవు. అత్తారింటికి దారేది, జల్సా సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన పవన్ మూడవ సినిమా ఊహించని విధంగా షాకిచ్చింది. తీరని నష్టం కలిగించిన ఆ సినిమా అభిమానులకు ఒక చేదు అనుభవమే. ఆ రిజల్ట్ ని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా మరచిపోలేకపోతున్నారు. పైగా సినిమా కాపీ కథ అంటూ దర్శకుడిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అజ్ఞతవాసి సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా సక్సెస్ ఒక రేంజ్ లో ఉండేదని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా అనంతరం మళ్ళీ పవన్ తో కలిసి త్రివిక్రమ్ పని చేయలేదు. మరొకసారి గురువుగారు తమ అభిమాన హీరోకి సక్సెస్ ఇస్తే బావుంటుందని ఎంతో మంది ఆశపడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి.

త్రివిక్రమ్ డైరెక్షన్ చేస్తాడో లేదో తెలియదు గాని ఆయన రాసిన కథలో మాత్రం పవన్ కళ్యాణ్ నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. గోపాల గోపాల దర్శకుడు డాలీ పవర్ స్టార్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ కోసం కథ, మాటలు రెడీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తీన్ మార్ సినిమాకు ఇదే తరహాలో పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ మాటలు అందించిన విషయం తెలిసిందే. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్ని రోజుకు వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here