నన్ను మీ నాన్న అన్న మాటలే.. నీకు ఇచ్చేశా!

0
124
ParthivPatel

భారత క్రికెట్ జట్టులో పార్థివ్ పటేల్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదనే అనిపిస్తుంది. అటు కీపర్, ఇటు బ్యాట్స్ మన్ రెండింటిలోనూ సత్తా ఉన్నా అవకాశాలు ఎప్పుడో ఒకసారి రావడంతో, ధోని పుట్టిన శకంలోనే పుట్టడం పార్థివ్ పాలిట శాపంగా మారింది. తాను ధోని పుట్టిన శకంలోనే పుట్టడం వల్ల తనకు అవకాశాలు రావడం కష్టమైపోయింది పార్థివ్ చాలాసార్లు బాధపడ్డాడు కూడా. ఇది తన దురదృష్టం అని కూడా పార్థివ్ ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. అయితే తనను మాట అంటే పార్థివ్ పటేల్ ఒప్పుకోడు మళ్ళీ తిరిగి వెంటనే వారికి కౌంటర్ వేసేస్తాడు.

ఒకసారి ఆసీస్ దిగ్గజ క్రికెటర్ మాజీ కెప్టెన్ స్టీవ్‌ వా 2003-2004 సీజన్ లో సిడ్నీ లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంలో టీమిండియా కీపరుగా ఉన్నపార్థివ్ పటేల్.. స్టీవ్‌ వా స్లెడ్జ్‌ చేయబోయాడు. దీనితో స్టీవ్‌ వా పార్థివ్ పటేల్ కు కొంచెం కూల్ గానే పంచ్ లు వేసాడు. అవేంటంటే ‘నేను క్రికెట్ బ్యాట్ పెట్టే సమయానికి నువ్వు నేపీస్‌ వేసుకుంటున్నట్లు ఉన్నావ్ను’ అని అన్నాడు. కాగా ఇది స్టీవ్‌ వా కు చివరి మ్యాచ్.

అయితే 2019 లో సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా పార్థివ్ అతని మాటలను తిరిగి అతనికే అప్పజెప్పాడు. అదేంటి స్టీవ్‌ వా ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటిస్తే పార్థివ్ ఇప్పుడు రీ కౌంటర్ వెయ్యడం ఏంటా అనుకుంటున్నారా. పార్థివ్ కౌంటర్ వేసింది అతని కొడుక్కి స్టీవ్‌ వా అన్న మాటలు మర్చిపోలేని పార్థివ్ పటేల్ అతని కొడుకుకి కౌంటర్ వేసాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో స్టీవ్‌ వా కుమారుడు ఆస్టిన్‌ వా సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిగా ఉన్నాడు.

ఆస్టిన్ ఫీల్డింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతని దగ్గరకు వెళ్లి పార్థివ్ నేను టెస్టుల్లో అడుగుపెట్టేటప్పుడికి నువ్వు నేపీస్‌లో ఉండి ఉంటావ్ అని, నన్ను ఈ మాటలు మీ నాన్న అన్నాడు. మళ్ళీ ఈ మాటలు నేను నిన్ను అన్నానని మీ నాన్నతో చెప్పుకో పో అని ఆస్టిన్‌ను ఆటపట్టించిన విషయాన్ని పార్థివ్ తాజాగా షేర్ చేసుకున్నాడు. కౌ కార్నర్‌ క్రోనికల్స్‌ యూ ట్యూబ్‌ న్యూ సిరీస్‌లో భాగంగా చంద్రకాంత్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పార్థివ్‌ ఈ విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here