గుట్టు చప్పుడు కాకుండా పసి బిడ్డ ప్రాణం తీశారు..

18
parents-kill-seven-days-old-baby-girl-near-madurais-usilampatti

మూడో సారి కూడా ఆడబిడ్డే పుట్టడం ఆ కుటుంబానికి భారమైంది. గుట్టుచప్పుడు కాకుండా ఊపిరి ఆపేసి ఆ బిడ్డను చంపేసి, అనారోగ్యం కారణంగా చనిపోయిందంటూ నాటకం ఆడారు. చివరకు పోస్టుమార్టం నివేదికతో బుక్కయ్యారు. మదురై ఉసిలంపట్టికి చెందిన చిన్నస్వామి, శివప్రియ దంపతులకు పెళ్ళై ఐదేళ్లు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతవారం మూడోసారి కూడా ఆడశిశువుకు శివప్రియ జన్మనిచ్చింది. పుట్టి ఏడు రోజులు కూడా కాలేదు. ఆ బిడ్డకు గురువారం నాడు హఠాత్తుగా ఆరోగ్యం బాగాలేదని ఆ కుటుంబం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

శిశువును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే, ఆ కుటుంబం పై వైద్యులకు అనుమానం కలగడంతో పాటుగా ఆ శిశువు చెవి భాగంలో చిన్న పాటి గాయం కనిపించింది. దీనితో పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు వెలుగు చూసింది. మూడోసారి కూడా ఆడబిడ్డే పుట్టిందన్న కారణంగా ఆ కుటుంబం వారే ఈ కిరాతకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానించారు. పోలీసులు, శిశువు తల్లిదండ్రులు ఇద్దర్ని అరెస్ట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here