“పలాస 1978” మూవీ రివ్యూ….! : మనస్సుకు హత్తుకునే చిత్రం

0
240
Palasa 1978 Movie Review

విడుదల తేదీ : మార్చి 06, 2020
Mirchi Pataka రేటింగ్ : 3/5
నటీనటులు : రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ తదితరులు
దర్శకత్వం : కరుణ కుమార్
నిర్మాత‌లు : ధ్యాన్ అట్లూరి
సంగీతం : రఘు కుంచె
సినిమాటోగ్రఫర్ : అరుల్ విన్సెంట్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా విడుదలైన ‘పలాస 1978’ చిత్రం ఈమధ్య కాలం లో మంచి హైప్ క్రియేట్ చేసి చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా ఈరోజు విడుదల కాగా వివరాల్లోకి వెళ్తే.. ఈ చిత్రాన్ని కరుణ కుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. మరియు రఘు కుంచె సంగీతాన్ని అందించారు. అంతేగాక ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కూడా నటించారు.

రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ తదితరులు వంటి సరిగ్గా పరిచయమున్న నటీనటులు కూడా లేని వీరు నటించిన ఈ చిత్రం మంచి స్పందనని రాబడుతుంది. చిన్న సినిమాలా వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించిందని చెప్తున్నారు. కధ కొత్తగా ఉందని ఎవరూ ఇప్పటివరకు టచ్ చేయని పాయింట్ తో దర్శకుడు చిత్రాన్ని బాగా తీసాడు. సమాజంలో తొక్కేయబడుతున్న అణగారిన వర్గాలు మరియు సమాజంలోని అసమానతలు బేస్ చేసుకుని ఈ సినిమాని నడిపించాడు దర్శకుడు. అయితే ఇలాంటి కధాంశంతో ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, కొంచెం అర్థవంతంగా ఈ సినిమా ఉంటుంది. ఒక కుటుంబం లోని నలుగురు అన్నదమ్ముల మధ్య జరిగే కద.

మాములుగా కొన్ని తమిళ సినిమాల్లో వాస్తవాలకు సంబంధించి వాస్తవికతను అందంగా తీర్చి దిద్దుతుంటారు. అలాంటిదే ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఇక ఈ సినిమాలో కనిపించే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి చక్కటి అర్థంపట్టే రోల్స్ ని ఇచ్చాడు దర్శకుడు. నటీనటుల నటన ఈ సినిమాకి హైలెట్. తక్కువ బడ్జెట్ లో ఇంకిత చక్కటి అవుట్ ఫుట్ రావడం అంటే చాలా గొప్పే అనిచెప్పుకోవాలి..! అయితే సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ క్లైమాక్స్ మాత్రం చాలా చక్కగా చిత్రీకరించాడు కరుణ కుమార్. ఆయనకి సినిమా పట్ల ఉన్న మక్కువ, మోజు, పనితనం.. ఈ సినిమా చుస్తే అర్ధమవుతుంది. అయితే నిర్మాణ విలువులు ఇంకా బెటర్ గా ఉంటే.. విజువల్ గా అవుట్ ఫుట్ ఇంకా బాగా వచ్చేది. ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారనే చెప్పుకోవాలి. రెగ్యులర్ మూవీకి దూరంగా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కీప్ పర్ఫెక్ట్ ఛాయస్ ఈ పలాస 1978 చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here