సొంతింటి కల నిజమవ్వాలంటే…వడ్డీ కట్టాలి…!

0
20
own-house-dream with different banks

మాములుగా జనాలు సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. కానీ చేతిలో సరిపడ డబ్బులు లేకనో డబ్బులు ఇచ్చేవాళ్ళు దొరకకనో.. మదనపడి పోతుంటారు. అయితే చాలామంది దీని కోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని ఆలోచన చేస్తుంటారు. ఆలోచన చేసినవెంటనే కొంతమంది ఇక బ్యాంకులకు వెళ్లడం.. లోన్ ఎంత వస్తే అంత తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడే ఒక మతలబు ఉంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకొని లోన్ జోలికి వెళ్ళాలి. లోన్ కోసం చేసేప్పుడు కొన్ని విషయాలపై అవగాహన ఏర్పరచుకుని సంసిద్ధం కావాలి.

కేవలం వారు ఎంత వడ్డీ కట్టించుకుంటున్నారు? అనేదానిపై కాకుండా ప్రోసెసింగ్ అనీ ఇంకా ఇతర చార్జీలు కూడా వేస్తుంటారు. అసలు వడ్డీ రేట్లు 7 శాతం వరకే ఉన్నప్పటికీ.. అయితే అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీని ఫాలో అవ్వవు. వీటన్నిటిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అతి తక్కువ (6.7 శాతం) వడ్డీకే రుణాలు ఇస్తుంది.

ఆ తర్వాత వరుసలో తక్కువ వడ్ఢేకి ఇచ్చే బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఉన్నాయి. ఇవి ఇంటి ఋణాలపై 6.85 శాతం వడ్డీకి ఋణాలను ఇస్తుండగా. అలాగే ఈ రెండు బ్యాంకుల తర్వాత పంజాబ్ నేషలన్ బ్యాంక్ (PNB), కెనరా బ్యాంక్ (CNB) వంటివి 6.9 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. ఇక దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్హె అయిన HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ వంటివి ఇంటి ఋణాలపై 6.95 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here