

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అ ఆ తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ వెంటనే శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే వంటి హిట్ సినిమాలతో పేరు తెచ్చుకుంది. అయితే ఈ మలయాళ బ్యూటీ మన తెలుగులో మాట్లాడగలదు కానీ రాయడం రాదు. దాంతో అ.. ఆ.. లు నేర్చుకుంటూ తెలుగు రాసే వేటలో పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి, కొత్త లక్ష్యాన్ని ఇప్పుడే నేర్చుకుంటున్నాను అని తెలిపింది.
అయితే కేరళ నుండి వచ్చిన అనుపమ మన తెలుగు భాష పై ఉన్నమక్కువతో దానిని రాయడం నేర్చుకుంటుంది కానీ మన తెలుగు హీరోలు చాలామందికి తెలుగు మాట్లాడటం తప్ప ఇప్పటికి కూడా రాయడం రాదు. మరి ఇప్పుడు అనుపమను చూసైనా మన హీరోలు తెలుగు రాయడం నేర్చుకుంటారో లేదో వేచి చూడాలి. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ’18పేజీస్’ సినిమాలో హీరో నిఖిల్ సరసన నటిస్తోంది. దీంతో పాటే తమిళ, మలయాళంలోనూ అనేక సినిమాల్లో నటిస్తోంది.